పంచాయతీలకు శుభవార్త.. నిధులపై వెసులుబాటు.!
మన భారత్,మొగుళ్ళపల్లి: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం మంచి శుభవార్తను అందించిందని మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం సర్పంచ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ఇకపై ట్రెజరీలో జమ చేయకుండా నేరుగా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ..పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించడం అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు పంచాయతీల ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేసిన అనంతరం అవసరాలకు నిధులు డ్రా...