e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి..

రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

-చీఫ్ ఇంజనీర్, భూపాలపల్లి నోడల్ ఆఫీసర్ జి.నాగప్రసాద్

మన భారత్,మొగుళ్ళపల్లి:

ఎల్ నీ నో ప్రభావంతో వర్షాలు పడక..పంటలు పండుతాయో లేదో అనే దిగులుతో బాధపడుతున్న రైతులకు అండగా ఉండి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా విధుల పట్ల అంకితభావంతో పనిచేసి రైతన్నలకు బాసటగా నిలవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని చీఫ్ ఇంజనీర్, భూపాలపల్లి నోడల్ ఆఫీసర్ నాగప్రసాద్ విద్యుత్ సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం ఆయన భూపాలపల్లి ఎస్ఈ నాగేల్లి సదానందంతో కలిసి మొగుళ్ళపల్లి విద్యుత్ ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అనంతరం విద్యుత్ సిబ్బందితో కలిసి మానిటరింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్ ని నో ప్రభావంతో వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి సమయంలో రైతులకు, వినియోగదారులకు విద్యుత్ సిబ్బంది ఎప్పటికీ అందుబాటులో ఉండాలని, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, ఫీడర్లలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆయన సూచించారు.

విద్యుత్ సిబ్బంది వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని, విద్యుత్ సమస్యలు ఎక్కడున్నా నిరంతరం వాటి పరిష్కారానికి కృషిచేసి విద్యుత్ శాఖకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. నాణ్యమైన విద్యుత్ రైతులకు అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డి ఈ పాపిరెడ్డి, చిట్యాల ఏడిఈ సుందర్ కుమార్, స్థానిక ఏఈ గుగులోతు నగేష్, ఫోర్ మెన్ యాదగిరి, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాయక్, లైన్మెన్ అనిల్ కుమార్, అసిస్టెంట్ లైన్మెన్లు రమేష్, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్, శంకర్, విద్యుత్ సిబ్బంది కిరణ్, మహేందర్ రెడ్డి తదితరులు, పాల్గొన్నారు

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE