e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

కొరికిశాలలో గ్రామ కమిటీ ఎన్నిక..

కొరికిశాలలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ గ్రామ కమిటీ ఎన్నిక

మన భారత్, మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కోర్కిశాల గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ గ్రామ కమిటీ ఎన్నికలు ఉత్సాహంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కోర్కిశాల గ్రామ ఇంచార్జ్ జిల్లా సీనియర్ నాయకులు నేరెళ్ల ఓదెలు మాదిగ, ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు బోల్లి బాబు మాదిగ, హాజరైనారు .
గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రేణికుంట్ల మహేష్, ఉపాధ్యక్షుడిగా ఎర్రబెల్లి రమేష్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా దుప్పటి చిరంజీవి, సహయ కార్యదర్శిగా రేణికుంట్ల సతీష్, సంయుక్త కార్యదర్శిగా రేణికుంట్ల వెంకటేష్, కోశాధికారిగా రేణికుంట్ల పైడిలను ఎన్నుకున్నారు. ప్రచార కార్యదర్శులుగా రేణికుంట్ల తిరుపతి, రేణికుంట్ల రమేష్ బాధ్యతలు చేపట్టారు. ముఖ్య సలహాదారులుగా రేణికుంట్ల తరుణ్, మధులను ఎంపిక చేశారు. కార్యవర్గ సభ్యులుగా రేణికుంట్ల నాగరాజు, రేణికుంట్ల శ్రీకాంత్, రేణికుంట్ల నవీన్, రేణికుంట్ల ప్రవీణ్ తదితరులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులను ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అభినందించారు. గ్రామస్థాయిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ

ఇన్చార్జి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE