e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

భూముల రి సర్వే వేగవంతం..

భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భూముల రీ-సర్వే, 22-ఏ, జి.ఓ. నెం. 59 తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే పనులు చేపట్టాలని, ఇందుకోసం రెండు ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేసి సమాంతరంగా సర్వే ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. మండల స్థాయిలో తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్, లైసెన్స్‌డ్ సర్వేయర్, గ్రామ పంచాయతీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రీ-సర్వే పనులను పర్యవేక్షించాలన్నారు. నిర్దేశిత కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సర్వే పనులు సజావుగా జరిగేలా చూడటంతో పాటు, ప్రతిరోజూ పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. 22-ఏ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించేటప్పుడు సంబంధిత రికార్డులు, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా జి.ఓ. నెం. 59 కింద అందిన దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. సింగరేణి భూముల క్రమబద్ధీకరణతో పాటు జి.ఓ. 59 దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ వాటి పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ మెమోలు, మార్గదర్శకాలు, నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు సంబంధించిన భూ సమస్యలను సకాలంలో పరిష్కరించడంతో పాటు, చేపట్టిన పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.

ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, అన్ని మండలాల తహశీల్దార్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9603952108

User Name : user_name : రాజు శీలపాక

user5442714
user5442714
I am a passionate writer and digital marketing enthusiast with years of experience in content creation, SEO, and online publishing. I enjoy exploring topics related to technology, travel, health, and lifestyle. My goal is to share valuable insights and connect with readers around the world. Feel free to visit my website for more articles and resources: https://www.google.com.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE