మన భారత్, ఆదిలాబాద్
బోథ్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌గా నియామకం.. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఘన సన్మానం
ఆదిలాబాద్, జూలై 16: బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌గా నియమితులైన మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు కు ఆదిలాబాద్ పట్టణంలో ఘన సన్మానం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు గంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాపురావుకు శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బోథ్ నియోజకవర్గ రాజకీయాల్లో రాథోడ్ బాపురావుకు విశేష అనుభవం ఉందని, పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వం కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన సమర్థవంతంగా పనిచేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
సన్మానానికి స్పందించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ బోథ్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటానన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజు సేట్, శాస్త్రి, మహేందర్, కాంతారావు తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాథోడ్ బాపురావుకు అభినందనలు తెలియజేశారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.
ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
