ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీకి వినతి ..

Published on

-Advertisement-

మన భారత్, విజయనగరం

విజయనగరం జిల్లాలో ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ A R దామోదర్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పూసపాటిరేగ, గజపతినగరం మార్గాల్లో రహదారి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చింతలవలస, డెంకాడ ప్రాంతాల్లో ప్రమాదకర బ్లాక్ స్పాట్స్ వద్ద తక్షణమే స్పీడ్ బ్రేకర్లు, రేడియం బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు.

అదేవిధంగా మార్కెట్ ప్రాంతాల్లో సీసీటీవీ నిఘాను పెంచాలని, ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా హెల్ప్ డెస్క్‌లను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయనగరం పట్టణంలోని రైల్వే బ్రిడ్జ్ నుంచి వై-జంక్షన్ వరకు రద్దీ సమయాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని, అక్కడ అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని కోరారు.

జిల్లా పోలీస్ శాఖ పనితీరును అభినందిస్తూ, ప్రజల నుంచి వస్తున్న సమస్యల ఆధారంగా ఈ వినతిపత్రం అందజేసినట్లు రెడ్డి పావని తెలిపారు. విజయనగరాన్ని సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

More like this