e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

అధికారుల కాళ్లు మొక్కిన రైతులు..!

రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతల ఆందోళనలు

మన భారత్, మంచిర్యాల:

ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని జాతీయ ప్రధాన రహదారిపై రైతులు వరి ధాన్యంతో బైఠాయించి నిరసన చేపట్టారు.

కష్టపడి పండించిన పంటను సమయానికి కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో వర్షాలు వస్తే పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడుపుతున్నా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు.

స్థానిక తహసీల్దార్ పుష్పలత రైతుల సమస్యలను తెలుసుకునేందుకు కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు అధికారిని కాళ్లపై పడి తమ గోడును వినిపించారు. “అన్నదాత బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.. రైతుల ఉసురు పోసుకోవద్దు” అంటూ వేడుకున్నారు. రైతుల ఆవేదన అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి భారీగా ఖర్చు పెట్టి పంట పండించినా చివరికి ధాన్యం అమ్ముకునేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి పరిస్థితులు ఒక్క మంచిర్యాల జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లిలో కూడా రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే పంపిన ధాన్యానికి కూడా లెక్కల్లో కోత విధించారని ఆరోపించారు.

లారీలు సకాలంలో రాకపోవడం, తూకం ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల రైతులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.

ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE