ఘనంగా బీరప్ప బండారు ఉత్సవాలు..

Published on

-Advertisement-

మన భారత్, ధన్వాడ:

ధన్వాడ మండలం ఎంనోన్‌పల్లి గ్రామంలో బీరప్ప బండారు ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. గోట్ూర్ కులస్తులు ఎల్లమ్మ బండారు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఉత్సవాల ప్రారంభానికి ముందు గ్రామంలోని ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు వేదమంత్రాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. పూజల అనంతరం బీరప్ప బండారు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా కురువ యాదవ సమాజానికి చెందిన కుటుంబ సభ్యులు తమ తమ సంప్రదాయం ప్రకారం బండారును చల్లుతూ ఉత్సవాలను మరింత శోభాయమానం చేశారు. గ్రామంలో ఉత్సవాల సందర్భంగా భక్తుల సందడి నెలకొని ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది.

గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఈ ఉత్సవాలు తమ సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుతూ తరతరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ద్వారా గ్రామ ఐక్యత మరింత బలపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భారతి సచిన్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, పూజారి మల్లప్ప, కాశీనాథ్ రెడ్డి, కురుమప్ప, అశోక్, శ్రీనివాసులు, రాములు, సిద్ధప్ప, రాజు, బీరప్పలు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు కొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...

ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ

మన భారత్, బీంపూర్: భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ప్రహరీ గోడ నిర్మాణానికి శుభారంభం...

More like this