ఘనంగా బీరప్ప బండారు ఉత్సవాలు..
మన భారత్, ధన్వాడ: ధన్వాడ మండలం ఎంనోన్‌పల్లి గ్రామంలో బీరప్ప బండారు ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. గోట్ూర్ కులస్తులు ఎల్లమ్మ బండారు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభానికి ముందు గ్రామంలోని ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు వేదమంత్రాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. పూజల...