e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణ నెంబర్ వన్ :సీఎం

మన భారత్, హైదరాబాద్:

టెక్స్‌టైల్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా నిర్వహించిన ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, టెక్స్‌టైల్స్ రంగ ప్రముఖులకు తెలంగాణ, హైదరాబాద్ తరఫున హృదయపూర్వక స్వాగతం పలికారు. భారతదేశానికి అత్యుత్తమ వస్త్రాల తయారీలో గొప్ప చరిత్ర ఉందని, శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్ రంగాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దాయని తెలిపారు. తెలంగాణ డీఎన్‌ఏలోనే టెక్స్‌టైల్ రంగం భాగమైందని పేర్కొన్నారు.

నిజాం కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారని గుర్తుచేశారు. టెక్స్‌టైల్స్ కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాకుండా లక్షలాది కుటుంబాల జీవనాధారం అని సీఎం వివరించారు. చారిత్రక నేపథ్యం వల్లే ఈ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు.

అదే విధంగా డీప్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఎనర్జీ వంటి రంగాల్లో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను మరోసారి స్పష్టం చేస్తూ, పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రస్తావిస్తూ, 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాలో టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్‌గా ఎదుగుతోందని, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలు ఇక్కడ ప్రారంభం కావడం గర్వకారణమని పేర్కొన్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకున్నాయని, ఇప్పుడు హాలీవుడ్ కూడా ఆకర్షితమవుతోందన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్ టెక్స్‌టైల్స్ హబ్‌లను అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో తయారైన వస్త్రాలు వినియోగంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE