జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బొల్లారపు బాబన్న నియామకం

Published on

-Advertisement-

మన భారత్: తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బొల్లారపు బాబన్నను నియమించిన సందర్భంగా తలమడుగు మండల కాంగ్రెస్ నాయకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం స్థానికంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎప్పటికప్పుడు గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. అదే క్రమంలో బాబన్నకు జిల్లా ఉపాధ్యక్ష పదవి లభించడం ఆయన సేవలకు నిదర్శనమని అన్నారు.

మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ, జెడ్పీటీసీగా ఉన్న సమయంలో బాబన్న మండల ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

మాజీ ఎంపీపీ కళ్యాణం రాజేశ్వర్, ఈ ప్రకాష్ రావు, మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, కజ్జర్ల సర్పంచ్ వెల్మ నారాయణరెడ్డి, కే ప్రతాప్, టీ గంగారెడ్డి, ఎన్ గంగాధర్, ఎన్ అశోక్, సల్ల దేవన్న, నరసయ్య, శ్రీనివాస్, రాజేశ్వర్, పూర్ణచందర్ తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాబన్న మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్, బోథ్ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు మరింత కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.

Latest articles

విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ ..

మొగుళ్ళపల్లి విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ బాధ్యతల స్వీకరణ -బాధ్యతలు చేపట్టిన ఏఈ గుగులోత్ నగేష్ ను...

వ్యాన్‌ను ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

మన భారత్, ఆదిలాబాద్ వ్యాన్‌ను ఢీకొన్న బైక్.. ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – యువకుడు అక్కడికక్కడే మృతి ఆదిలాబాద్, జూలై...

చోరీ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

మన భారత్, ఆదిలాబాద్ సీసీటీవీ ఆధారాలతో ద్విచక్ర వాహన చోరీ ముఠా గుట్టురట్టు.. 7 బైక్‌లు స్వాధీనం, నలుగురు అరెస్ట్ ఆదిలాబాద్,...

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

More like this