ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి..

Published on

-Advertisement-

మన భారత్: తాంసి, ఆదిలాబాద్:

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు తాంసి మండల కేంద్రంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు వెంకట రమణ మాట్లాడుతూ, అధికారంలోకి రావడానికి ముందు 100 రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం రైతు భరోసా పథకానికి సంబంధించి స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి మద్దతు అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నిరసనతో తాంసి ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మండల కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాష్, యువ సర్పంచ్ ఈరగొల్ల అశోక్, రఘు, మలపతి అశోక్, అండె అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Latest articles

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష సూచన..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక పలు మండలాల్లో ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం మన...

నాలుగు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికుల ఆవేదన..

బకాయి వేతనాల చెల్లింపుకు రెండో రోజు పనుల బంద్ జూన్ 9లోపు జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు హెచ్చరిక మన భారత్,...

ఉపాధి హామీ మహిళలకు భద్రత, చట్టాలపై అవగాహన

నాతవలసలో మహిళలతో ఎస్సై సన్యాసి నాయుడు సమావేశం శక్తి యాప్, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణపై విస్తృత చర్చ మన...

మరికాసేపట్లో మున్నూరు కాపు అధ్యక్షుడిగా తోట శివన్న ప్రమాణ స్వీకారం..

నేడు మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం నూతన కమిటీ బాధ్యతల స్వీకారం – సమాజ అభ్యున్నతికి కృషి చేయనున్న...

More like this