e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

వేడుకల్లో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ..

మన భారత్, తలమడుగు :

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో మిలటరీ మెన్ తలార్ల కిరణ్ గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇంట్లో సుఖశాంతులు నెలకొని, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు కూడా కార్యక్రమంలో పాల్గొని తలార్ల కిరణ్ కుటుంబాన్ని అభినందించారు. దేశ సేవలో ఉన్న సైనికులు గ్రామానికి గర్వకారణమని, వారి సేవలు అందరికీ ఆదర్శమని గోక గణేష్ రెడ్డి పేర్కొన్నారు.

అనంతరం బోరిగామ గ్రామానికి చెందిన బద్దం స్వామినాథరెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమానికి కూడా మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో కజ్జర్ల గ్రామ సర్పంచ్ ఎల్మా నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ గంగన్న, మాజీ ఎంపీటీసీ పూర్ణచందర్, ఎం. పోశెట్టి, తిరుపతి, సంతోష్, నారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలో జరిగిన ఈ రెండు కార్యక్రమాలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.

Mana Bharath – Leading News Portal

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE