సనాతన ధర్మ పరిరక్షకుడు శివాజీ మహారాజ్..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, దేశభక్తి నినాదాలతో శోభాయాత్ర చేపట్టారు.

సర్పంచ్ పోరండ్ల సంతోష్, పూజారి శివాజీ పంతులుతో కలిసి వేద మంత్రాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల్లో శోభాయాత్ర నిర్వహిస్తూ శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయక జీవితం, ధైర్యసాహసాలు, పరిపాలనా నైపుణ్యాన్ని గుర్తుచేసుకున్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి గీతాలతో వేడుకలకు ఉత్సాహాన్ని జోడించారు.

గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ఉప సర్పంచ్ మేకల శ్రీరామ్, శానం శ్రీనివాస్, బీజేపీ యువమోర్చ తలమడుగు అధ్యక్షులు దాతజీ కిరణ్ తదితరులు శివాజీ మహారాజ్ పరాక్రమాన్ని కొనియాడారు. హిందూ సమాజ ఐక్యతకు ఆయన జీవితం ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అడెపు శ్రీను, గంధం నరేష్, పులవేణి గణేష్, రేగుల మోహన్, సీపతి నగేష్, గొల్లని మోహన్, నాయిని పొచన్న, పోరండ్ల రాములు, గోనె శ్రీనివాస్, పోతుగంటి అశోక్, ఓస రవి, శాగంటి విష్ణు, నాయిని నవీన్, సంఘర్తి నారాయణ, నాపెళ్ళి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువకులు, హిందూ బంధువులు భారీగా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గ్రామంలో దేశభక్తి వాతావరణం నెలకొని, యువతలో జాతీయ చైతన్యం పెంపొందించాల్సిన అవసరాన్ని నాయకులు ప్రస్తావించారు.

Latest articles

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య...

“అమ్మ మాట.. అంగన్వాడి బాట” సర్పంచ్

'అమ్మ మాట.. అంగన్వాడి బాట’లో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం విద్యకు తొలి అడుగు అంగన్వాడితోనే.. తల్లిదండ్రులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి:...

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

తలమడుగులో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు వ్యసన రహిత...

ఆ యువకులకు ఘన సన్మానం..

దేవాపూర్ యువకులకు ఘన సన్మానం.. అగ్నివీర్‌గా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచిన ముగ్గురు యువత దేశసేవకు సిద్ధమైన రాకేష్, గురు, లోకేష్...

More like this

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య...

“అమ్మ మాట.. అంగన్వాడి బాట” సర్పంచ్

'అమ్మ మాట.. అంగన్వాడి బాట’లో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం విద్యకు తొలి అడుగు అంగన్వాడితోనే.. తల్లిదండ్రులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి:...

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

తలమడుగులో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు వ్యసన రహిత...