చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు సిటీ సివిల్ కోర్టు రక్షణ

Published on

-Advertisement-

చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు సిటీ సివిల్ కోర్టు రక్షణ – అనుమతి లేకుండా పేరు, ఫోటోలు వాడరాదని ఆదేశం

మన భారత్, హైదరాబాద్: ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి పేరు, ఫోటో, వాయిస్, లేదా ఏ విధమైన వ్యక్తిగత గుర్తింపులను అనుమతి లేకుండా వాడరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన వ్యక్తిత్వం, ప్రచార హక్కులు దుర్వినియోగమవుతున్నాయంటూ చిరంజీవి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం కోర్టు ఆయన పక్షాన తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, ఏ వ్యక్తి లేదా సంస్థ చిరంజీవి పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్, లేదా గుర్తించదగిన ఇతర అంశాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన అనుమతి లేకుండా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అదేవిధంగా ‘మెగాస్టార్’, ‘చిరు’, ‘అన్నయ్య’ వంటి పేర్లను ఉపయోగించి ఏఐ మార్ఫింగ్ లేదా డిజిటల్ వేదికలపై దుర్వినియోగం చేయరాదని హెచ్చరించింది. టీఆర్పీ , లాభాల కోసం చిరంజీవి పేరు, రూపం, వాయిస్‌ను వాడిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించిన 30 మందికి నోటీసులు జారీ చేయగా, తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది.ఈ తీర్పుతో సినీ పరిశ్రమలో ప్రముఖుల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై కొత్త చర్చ ప్రారంభమైంది.

Latest articles

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

More like this