e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

నర్సాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీలోకి పలువురు బీఆర్ఎస్ నాయకుల చేరిక

నర్సాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీలోకి పలువురు బీఆర్ఎస్ నాయకుల చేరిక
పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి: రాథోడ్ బాపురావు

మన భారత్, ఇచ్చోడ: నవంబర్ 22, ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన చేరిక కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హాజరై నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో ఎల్లప్పుడూ తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. రాజకీయాల్లో ప్రజల విశ్వాసం ఎంతో ముఖ్యమని, ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములైనప్పుడే నాయకులకు ఆదరణ, గుర్తింపు లభిస్తాయని పేర్కొన్నారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తమ అనుభవాన్ని, స్థానికంగా ఉన్న పరిచయాలను పార్టీ అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు.

నర్సాపూర్ గ్రామం నుంచి పలువురు నాయకులు పార్టీలో చేరడం సంతోషకరమని పేర్కొన్న ఆయన, రాబోయే రోజుల్లో మరింత మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజల మద్దతుతో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ రాథోడ్ బాపురావు నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE