e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

బాధిత కుటుంబానికి ఉద్యోగం ఇందిరమ్మ ఇల్లు కల్పించి అండగా నిలిచిన కలెక్టర్ రాజర్షి షా

బాధిత కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు కల్పించి అండగా నిలిచిన కలెక్టర్ రాజర్షి షా

కలెక్టర్‌కు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 21: రిమ్స్ ఆసుపత్రిలో కవల శిశువులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న బోరేకర్ సునీత కుటుంబానికి అండగా నిలిచి, ఉపాధి కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షాపై టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి దుర్గం శేఖర్‌తో పాటు పలువురు నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి అభినందనలు తెలియజేశారు. కవల శిశువులను కోల్పోయిన అనంతరం ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బోరేకర్ సునీత కుటుంబ పరిస్థితిని గుర్తించి, వారికి ఉద్యోగం కల్పించడంతో పాటు సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం గొప్ప మానవతా దృక్పథానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.

బాధిత కుటుంబానికి కేవలం పరామర్శకే పరిమితం కాకుండా, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉపాధి, గృహ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ అర్హులైన బాధితులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్న కలెక్టర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పరమేశ్వర్, మేకల జితేందర్, ప్రజ్ఞశీల్, జితేందర్ సోంకాంబ్లె తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE