e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కలెక్టర్ రాజర్షి షా

వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కలెక్టర్ రాజర్షి షా

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 21, జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం ఆదిలాబాద్ జిల్లా మావలలో నిర్వహించిన వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మావలలోని తిరుమల క్లాసిక్ గార్డెన్స్‌లో సురుకుంటి మంజుల, శ్రీధర్ రెడ్డి దంపతుల కుమారుడి వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆహ్వానితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా హాజరై నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జీవితంలో పరస్పర అవగాహన, ప్రేమానురాగాలతో ముందుకు సాగుతూ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు.

కలెక్టర్ రాజర్షి షా వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE