e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

మొగుళ్ళపల్లి: నవంబర్ 20, (మనభారత్):

ప్రభుత్వ అనుమతులు లేకుండా మొగుళ్ళపల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకుని కేసులు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం రంగాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల, స్మశాన వాటిక సమీపంలో తనిఖీలు నిర్వహించగా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లను పట్టుకొని విచారించగా, ఇతరుల సూచన మేరకు ఇసుకను ఆక్రమంగా తరలించి విక్రయిస్తునట్లు వెల్లడైంది. చిట్యాల సిఐ వై .సతీష్ ఆదేశాల మేరకు, మొగుళ్ళ పల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ ఆధ్వర్యంలో రెండు ట్రాక్టర్ ట్రాలీలను సాద్వినం ఇద్దరిపై వేర్వేరు కేసులు నమోదు చేశారు .ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అక్రమ రవాణా కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE