e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

సేవా కార్యక్రమాలతో సమాజంలో చైతన్యం కలిగిస్తున్న లయన్స్ క్లబ్.

ముస్తాబాద్‌లో ఉచిత కంటి వైద్య శిబిరంలో సేవా కార్యక్రమాలపై అవగాహన.

రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 19 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : లయన్స్ క్లబ్ అఫ్ ఎల్లారెడ్డిపేట వారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లో సామాజిక బాధ్యతపై చైతన్యం కల్పించారు.విద్య, వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో లయన్స్ క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని క్లబ్ కార్యదర్శి గుర్రాల రాజిరెడ్డి తెలిపారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రేరణాత్మక తరగతులు నిర్వహించడంతో పాటు పేద ప్రజలకు అందుబాటులో ప్రతి నెల ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందిస్తున్నట్లు వివరించారు.అలాగే అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు చేయించడం, వేసవికాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, మజ్జిగ పంపిణీ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలందించడం వంటి కార్యక్రమాలను సామాజిక బాధ్యతగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.సమాజంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు సేవలు చేరువ చేయడమే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని, సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుర్రాల రాజిరెడ్డి కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE