e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

రిబ్బన్ కటింగ్‌లకే పరిమితమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు!

ప్రారంభించి రోజులు గడుస్తున్నా తూకాలు శూన్యం.
దళారుల చేతుల్లో రైతులకు నష్టం.

క్వింటాల్‌కు రూ.3,200 నుంచి రూ.2,300కు పడిపోయిన ధర.. ప్రైవేటు వ్యాపారులకే ధాన్యం విక్రయం

రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 15 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర :కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంపై గొల్లపల్లి సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలు రిబ్బన్ కటింగ్‌లు, కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితమయ్యాయని, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంలో మాత్రం జాప్యం జరుగుతోందని విమర్శించారు.

కొనుగోలు కేంద్రాల్లో తూకాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు, దళారులు ధరలను తగ్గిస్తూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ధాన్యానికి రూ.3,200 వరకు ధర పలకగా, ప్రస్తుతం దళారులు రూ.2,300కే అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ప్రైవేటు వ్యాపారులు, రైస్ మిల్లర్లు అధిక ధర చెల్లిస్తుండటంతో కొంతమంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కోసం వేచి చూడకుండా మధ్యవర్తులు, ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించినట్లు సమాచారం. ఇప్పటికే అధిక శాతం ధాన్యం ప్రైవేటు వ్యాపారులు, రైస్ మిల్లర్ల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో రైతులకు ఉపయోగపడటం లేదనే చర్చ రైతుల్లో నెలకొంది.

ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రారంభించిన ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తక్షణమే తూకాలు ప్రారంభించాలని కొండ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు.

రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని, దళారుల బారినపడి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE