e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ దుర్మరణం.. గుత్పాల గ్రామంలో విషాదఛాయలు

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ దుర్మరణం.. గుత్పాల గ్రామంలో విషాదఛాయలు

మన భారత్, నేరడిగొండ:నవంబర్ 18, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేరడిగొండ మండలం గుత్పాల గ్రామంలో విషాదాన్ని నింపింది. రోలమామడ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుత్పాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాశికంటి రవి తీవ్రంగా గాయపడి మృతి చెందారు.

వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రోలమామడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాశికంటి రవి తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన వారు వెంటనే ఆయనను మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

గాశికంటి రవి మృతి వార్త తెలియడంతో గుత్పాల గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌గా ఆయన మృతిపట్ల పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, రవి మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE