e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

56 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ..

కజ్జర్ల గ్రామంలో 56 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

మన భారత్, తలమడుగు:నవంబర్ 18, తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నూతనంగా మంజూరైన 56 చేయూత పింఛన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామానికి కొత్తగా మంజూరైన 56 పింఛన్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రయోజనాలు అందనున్నాయి. పింఛన్ల మంజూరు పత్రాలను అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి, ఉపసర్పంచ్ అగ్గిమల్ల గంగన్న, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా చేయూత పింఛన్లు మంజూరైన 56 మంది లబ్ధిదారులకు గ్రామపంచాయతీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE