e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు – ఎంపీ గోడం నగేష్

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు – ఎంపీ గోడం నగేష్
దిశ సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు..

ప్రోటోకాల్ పాటించకుంటే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచన

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 18, జిల్లా అభివృద్ధి పనుల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం బుధవారం ఎంపీ గోడం నగేష్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా కో-కన్వీనర్‌గా వ్యవహరించారు.

ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్షించారు. రైల్వే, జాతీయ రహదారులు, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యాశాఖ, ఐసీడీఎస్, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్యశాఖ, రిమ్స్, ఉపాధి కల్పన, వ్యవసాయ, సాగునీటి శాఖలతో పాటు ఉపాధి హామీ పథకం తదితర శాఖల అధికారులు సమావేశానికి హాజరై ఆయా శాఖల పనుల వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. శాఖల మధ్య సమన్వయం లోపించకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేశారు.

జాతీయ రహదారి పనులపై అసంతృప్తి

గుడిహత్నూర్ మండలంలో కొనసాగుతున్న జాతీయ రహదారి పనుల పురోగతిపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉపాధి హామీ జాబ్ కార్డులపై ప్రశ్నలు

ముత్నూర్ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డుల పంపిణీపై ఎంపీ సంబంధిత పీడీని ప్రశ్నించారు. అర్హులైన కూలీలకు జాబ్ కార్డులు అందించడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత పాటిస్తూ అర్హులకు న్యాయం చేయాలని సూచించారు.

పీఎం జన్మన్ నిధుల వివరాలు వెల్లడించాలి

పీఎం జన్మన్ పథకం కింద జిల్లాలో చేపడుతున్న పనులు, వాటికి సంబంధించిన నిధుల వివరాలు, కేంద్ర ప్రభుత్వ వాటా స్పష్టంగా చూపించాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో నిధుల వివరాలు, పనుల పురోగతి పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు.

ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంపీ గోడం నగేష్ స్పష్టం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలను సహించేది లేదని, అధికారులు నిబంధనలు పాటించని పక్షంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సస్పెన్షన్‌కు సిఫారసు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

అంగన్వాడీ నియామకాలపై వివరణ కోరిన ఎంపీ

అంగన్వాడీ కేంద్రాల్లో నూతన నియామకాల ఎంపిక ప్రక్రియలో రోస్టర్ విధానం అమలుపై సంబంధిత అధికారిని ఎంపీ వివరణ కోరారు. నియామకాల్లో ప్రభుత్వ నిబంధనలు, పారదర్శకత పాటించాలని సూచించారు.

సమావేశంలో నూతనంగా నియమితులైన దిశ కమిటీ సభ్యులను పరిచయం చేశారు. సభ్యులు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనులపై అడిగిన ప్రశ్నలకు ఎంపీ సంబంధిత అధికారులతో సమాధానాలు ఇప్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి దిశ కమిటీ సభ్యులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ఈ సమావేశానికి కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) పీడీ రాథోడ్ రవీందర్ నిర్వహించారు. దిశ కమిటీ సభ్యులు జీవీ రమణ, వాగ్మారే శైలేందర్, వామన్ పటేల్, నివేదిత, తులసిరామ్, నివేదిత వాజే, తుకారాం, అరుణ్ తరోడి, ప్రద్యుమ్న (సన్నీ), సర్పంచులు అంకిత, రాకేష్ యాదవ్, పూనం జగన్, బొడ్కే తదితరులతో పాటు దిశ కమిటీ సభ్యులు నరేందర్, మున్సిపల్ చైర్మన్ భండారి అనూష, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE