e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

నిర్మల్ బీఆర్ఎస్ రైతు గర్జన సభకు హాజరైన భీంపూర్ బీఆర్ఎస్ నాయకులు

నిర్మల్ బీఆర్ఎస్ రైతు గర్జన సభకు హాజరైన భీంపూర్ బీఆర్ఎస్ నాయకులు

మన భారత్, బీంపూర్:నవంబర్ 11, నిర్మల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన సభకు భీంపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. భీంపూర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ సంతోష్ ఆధ్వర్యంలో బెల్సరీ రాంపూర్ గ్రామానికి చెందిన పార్టీ సభ్యులు సభలో పాల్గొన్నారు.

రైతు సమస్యలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రైతులకు అందాల్సిన ప్రభుత్వ సహాయంపై పార్టీ నిర్వహించిన ఈ సభకు నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రైతుల పక్షాన పార్టీ తరఫున పోరాటాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో సభలో పాల్గొన్నట్లు నాయకులు తెలిపారు.

భీంపూర్ మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా సభకు హాజరుకావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో నిరంతరం భాగస్వాములవుతామని వారు పేర్కొన్నారు.

రిపోర్టర్: గేడం రమాకాంత్ భీంపూర్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE