e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

భూ వివాదంలో అక్రమ ప్రవేశం.. ఆక్రమణకు యత్నం భూ యజమానులను బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

భూ వివాదంలో అక్రమ ప్రవేశం.. ఆక్రమణకు యత్నం
భూ యజమానులను బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 11,

ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్‌కే కాలనీ పరిధిలో భూ వివాదానికి సంబంధించి అక్రమంగా భూమిలోకి ప్రవేశించి, ఆక్రమణకు ప్రయత్నించడంతో పాటు భూ యజమానులను బెదిరించిన వ్యక్తిపై మావల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అల్లూరి భూమన్న అనే వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మావల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేఆర్‌కే కాలనీ పరిధిలోని సర్వే నంబర్లు 68/44/1, 68/44లో ఉన్న సుమారు ఐదు ఎకరాల భూమికి సంబంధించి అస్లాం బిన్ అలీతో పాటు మరికొందరు 2009 సంవత్సరం నుంచి హక్కులు కలిగి, భూమిని తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, 2026 అక్టోబర్ 10వ తేదీన అల్లూరి భూమన్న మరికొందరితో కలిసి సదరు భూమిలోకి అక్రమంగా ప్రవేశించినట్లు ఫిర్యాదులో తెలిపారు. అక్కడ టెంట్, కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు తన పేరుతో బోర్డు పెట్టి భూమిపై తనకు హక్కులు ఉన్నట్లు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

ఈ చర్యలను భూ యజమానులు ప్రశ్నించగా వారిని బెదిరించినట్లు, వారు ఏర్పాటు చేసిన అభ్యంతర బోర్డును సైతం తొలగించినట్లు ఫిర్యాదులో వివరించారు. అంతేకాకుండా భూమిని తిరిగి ఆక్రమించుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 763/2026గా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 329(3), 324(4), 351(2) రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.

భూ వివాదాలపై పోలీసుల సూచన

భూములు, స్థలాలకు సంబంధించిన వివాదాల్లో ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు సూచించారు. వివాదాస్పద భూముల్లో బలవంతంగా ప్రవేశించడం, ఆక్రమణలకు ప్రయత్నించడం, ఇతరులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలు ఉన్నవారు న్యాయపరమైన మార్గాలను అనుసరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE