e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

ఆదిలాబాద్ ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

స్థానిక యువతకు ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు – మంత్రి శ్రీధర్ బాబు

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 11, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఎంపీ గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఐటీ టవర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణలో ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక అభివృద్ధికి ఈ కేంద్రం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ అందుబాటులోకి రావడం స్థానిక యువతకు కొత్త అవకాశాలను కల్పించే పరిణామమని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఐటీ సంస్థలు, సాంకేతిక రంగానికి సంబంధించిన కార్యకలాపాలు జిల్లాకు విస్తరిస్తే యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో ఐటీ టవర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆసిఫాబాద్ డీసీసీ నాయకురాలు ఆత్రం సుగుణక్క, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపుల సత్యనారాయణ, మావల సర్పంచ్ చంద్రశేఖర్, సావర్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE