e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఆదివాసీలు

బెల్సరి రాంపూర్‌లో సంప్రదాయబద్ధంగా దండారి సంబరాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామ పెద్దలు

మన భారత్, భీంపూర్:నవంబర్ 7,

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే దండారి (గుస్సాడి) ఉత్సవాలు భీంపూర్ మండలంలోని బెల్సరి రాంపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, గ్రామ పెద్దలు సంప్రదాయబద్ధంగా దండారి వేడుకలకు సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఆదివాసీ సంస్కృతిలో దండారి ఉత్సవాలకు విశిష్టమైన స్థానం ఉంది. తరతరాలుగా వస్తున్న ఆచారాలను కొనసాగిస్తూ, గ్రామ దేవతలకు పూజలు నిర్వహించడం, సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు జరుపుకోవడం ఈ ఉత్సవాల్లో ప్రత్యేకతగా నిలుస్తుంది. పూర్వీకుల నుంచి సంక్రమించిన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పటేల్ పెందోర్ ఉమేష్, గట్యల్ మార్స్కోలా మారుతి, మహాజన్ పుర్క గణేష్, దేవరి గేడం ప్రమోద్ పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా భీంపూర్ మాజీ ఎంపీపీ రత్నా ప్రభా సంతోష్ కూడా పాల్గొని ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు.

గ్రామస్థులు సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ దండారి సంబరాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆదివాసీ అస్తిత్వానికి, ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా నిలిచే ఈ ఉత్సవాలు గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE