దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఆదివాసీలు
బెల్సరి రాంపూర్‌లో సంప్రదాయబద్ధంగా దండారి సంబరాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామ పెద్దలు మన భారత్, భీంపూర్:నవంబర్ 7, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే దండారి (గుస్సాడి) ఉత్సవాలు భీంపూర్ మండలంలోని బెల్సరి రాంపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, గ్రామ పెద్దలు సంప్రదాయబద్ధంగా దండారి వేడుకలకు సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతిలో దండారి ఉత్సవాలకు విశిష్టమైన స్థానం ఉంది. తరతరాలుగా...