e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

148 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

148 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి పథకం ఆర్థిక భరోసా – ఎమ్మెల్యే పాయల్ శంకర్

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 5, పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ హాల్‌లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ మండలాలకు చెందిన మొత్తం 148 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ అర్బన్ మండలానికి చెందిన 117 మంది, ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందిన 17 మంది, సత్నాల మండలానికి చెందిన 9 మంది, జైనథ్ మండలానికి చెందిన 5 మంది లబ్ధిదారులు కళ్యాణలక్ష్మి చెక్కులు అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాల సమయంలో తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అలాంటి కుటుంబాలకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం ఆలస్యం కాకుండా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దరఖాస్తుల పరిశీలన, ఆమోదం, చెక్కుల తయారీ ప్రక్రియను వేగవంతం చేసి లబ్ధిదారులకు త్వరితగతిన అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఎవరైనా మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు.

పేద కుటుంబాలు తమ కుమార్తెల వివాహాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని వివాహం జరిగిన 7 నుంచి 10 రోజుల్లోపు అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తాను ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు.

సంక్షేమ పథకాల అసలు ఉద్దేశం అర్హులైన పేద కుటుంబాలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడమేనని, దరఖాస్తుల నుంచి చెక్కుల పంపిణీ వరకు ప్రతి దశలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE