e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

శాంతాపూర్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించిన రాథోడ్ బాపురావు
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. మనోధైర్యం కల్పించిన బోథ్ మాజీ ఎమ్మెల్యే

మన భారత్, గుడిహత్నూర్:నవంబర్ 5, కష్టసమయాల్లో బాధిత కుటుంబాలకు అండగా నిలవడమే సామాజిక బాధ్యత అని తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.

గుడిహత్నూర్ మండలంలోని శాంతాపూర్ గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో భరత్, గులాబ్ సింగ్, రావు సింగ్, నివాస్ మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న రాథోడ్ బాపురావు గురువారం శాంతాపూర్ గ్రామాన్ని సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా భరత్, గులాబ్ సింగ్, రావు సింగ్, నివాస్ కుటుంబాలను విడివిడిగా కలిసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ పెద్దలను, ఆప్తులను కోల్పోయిన బాధలో ఉన్న వారిని ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు.

అనుకోని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులను కోల్పోవడం ఎంతో బాధాకరమని, ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేరని రాథోడ్ బాపురావు పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని సూచించారు. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో శాంతాపూర్ సర్పంచ్ సబ్లె పత్తుసింగ్, మండల కన్వీనర్ పెట్ల మహేందర్, మాజీ మండల కన్వీనర్ కారాడ్ బ్రహ్మానంద్, సచిన్ లాగడ్, తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE