e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

రైతుల సమస్యల పరిష్కారానికి బీజేపీ నిరంతర పోరాటం

రైతుల సమస్యల పరిష్కారానికి బీజేపీ నిరంతర పోరాటం
బేల మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్

మన భారత్, బేల: అక్టోబర్ 30, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బేల మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అండగా నిలవడంతో పాటు క్షేత్రస్థాయిలో వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతోనే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్న ఆయన, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.

నీతినిజాయితీతో ప్రజలకు సేవ చేసే కార్యకర్తలకు బీజేపీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అత్యధిక సభ్యత్వాలు సాధించడం కార్యకర్తల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

అదేవిధంగా ఈవీఎంలు, ఎస్ఐఆర్ (SIR) వంటి ఎన్నికల సంబంధిత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ అంశాలపై ప్రజలతో చర్చిస్తూ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విషయాలను వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE