e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

కొడిమ్యాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

కొడిమ్యాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
జగిత్యాల/కొడిమ్యాల, నవంబర్ 26, మన భారత్ :
కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘాల రాష్ట్ర కార్యదర్శి కొత్తూరు స్వామి ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును గుర్తు చేసుకుంటూ రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. భారత రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం, ఓటు హక్కు లభించాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం కల్పించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, ఉపసర్పంచ్ గుర్రం నర్సయ్య, మాజీ కేడీసీసీ డైరెక్టర్ గుడి మల్లికార్జున్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు ఎలగుర్తి రవీందర్, ఉపాధ్యక్షులు పర్లపల్లి ప్రభుదాస్, నాయకులు కోలాపురం రమేష్, లింగాల అజయ్, మహంకాళి గంగరాజం, పర్లపల్లి భాస్కర్, సుంకే నరేష్, కొత్తూరి అశోక్, కోలాపురం శంకర్ తదితర నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE