e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన తాంసి జూనియర్ కళాశాల

రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన తాంసి జూనియర్ కళాశాల

మన భారత్, తాంసి:నవంబర్ 26,

భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, పౌరుల హక్కులు, బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ వేడుకలు భారత రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనంతో ప్రారంభమయ్యాయి. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి రాజ్యాంగ పీఠికను చదివి ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ మౌలిక విలువల పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.

అనంతరం భారత రాజ్యాంగంపై విద్యార్థులకు ఆసక్తి పెంపొందించడంతో పాటు రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ, పౌరుల హక్కులు, విధులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన పెరగడంతో పాటు బాధ్యతాయుత పౌరులుగా ఎదిగేందుకు దోహదపడుతుందని అధ్యాపకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయభాస్కర్, ఏజీఎంసీ శశికుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ఇన్‌చార్జి సంతోష్‌తో పాటు అధ్యాపకులు రమణరెడ్డి, తిరుపతిరెడ్డి, మల్లేష్, అనుపమ, దేవేందర్, తణుబాయి, వెంకటేష్, రాజేందర్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకుల సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE