e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

వైభవంగా గోవిందా స్వామి రథయాత్ర..

గోవింద నామస్మరణతో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం
రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 30, ఆదిలాబాద్ పట్టణంలోని శాస్త్రి మందిరం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని శుక్రవారం రాత్రి భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణతో పట్టణ పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

రథోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తిని పుష్పాలతో అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి ఊరేగింపును ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందా.. గోవిందా నామస్మరణతో రథోత్సవం కన్నులపండువగా సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జోగు శైలజా రవి, రవికాంత్, మనోజ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE