e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, October 26, 2026

కల్తీ మిర్చి విత్తనాలతో రైతులకు తీవ్ర నష్టం.!

గుంత కోడూరులో 10 ఎకరాల్లో దెబ్బతిన్న మిర్చి పంట

బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: సీపీఎం మండల కార్యదర్శి అంతటి కాశన్న

తాడూరు, మన భారత్ ప్రతినిధి:

నకిలీ లేదా నాణ్యతా లోపాలున్న మిర్చి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని గుంత కోడూరు గ్రామంలో ఆదివారం సీపీఎం ప్రతినిధి బృందం పంట పొలాలను సందర్శించి, దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలించింది. గ్రామంలో సుమారు 10 ఎకరాల్లో మిర్చి సాగు దెబ్బతిన్నట్లు నాయకులు తెలిపారు.

గ్రామానికి చెందిన రైతులు చెన్న మల్లేష్, ఉద్దారపు భాస్కర్, కొరుపాల బాలరాజు, ఎం.డి. జాంగిర్, చెన్న శ్యాంసుందర్, చెన్న రాములు, గూల వెంకటయ్య, చింతకాయల చంద్రయ్య, గోరంట్ల పెంటయ్య తదితరుల పొలాలను సీపీఎం నాయకులు పరిశీలించారు. నిరుప పంట చేను, కలాష్, కుబేర్ 305, ఈషా, రాఖీ రకం మిర్చి విత్తనాల నాణ్యతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పంట పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా అంతటి కాశన్న మాట్లాడుతూ.. రైతులు అప్పులు చేసి, వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి పంటలు సాగు చేస్తున్నారని, విత్తనాల నాణ్యతలో లోపాలు ఉంటే తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంట నష్టంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

విత్తనాలపై సమగ్ర విచారణ చేపట్టాలి

మిర్చి విత్తనాల నాణ్యతపై రైతులు చేస్తున్న ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని సీపీఎం నాయకులు కోరారు. సంబంధిత విత్తనాల నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించాలని, పంట నష్టానికి గల కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. విచారణలో విత్తనాల నాణ్యతా లోపాలు నిర్ధారణ అయితే సంబంధిత కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని కోరారు.

రైతులకు న్యాయం జరిగే వరకు సీపీఎం తరఫున పోరాటం కొనసాగిస్తామని అంతటి కాశన్న స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు చెన్న శ్యాంసుందర్, ఏనుపోతుల కాశన్నతో పాటు చెన్న మల్లేష్, చెన్న రాములు, ఉద్దారపు భాస్కర్, ఎం.డి. జాంగిర్, గోరంట్ల పెంటయ్య, కొరుపాల బాలరాజు, చింతకాయల చంద్రయ్య, చింతకాయల గణేష్, గూల వెంకటయ్య, బండారి వెంకటయ్య, బండారు గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE