e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

రైతు భీమా కొనసాగించాలని డిమాండ్..

రైతు కాడే లస్మన్న కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది

కుటుంబాన్ని పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. రైతు భీమా కొనసాగించాలని డిమాండ్

మన భారత్, అక్టోబర్ 6, తలమడుగు: పంట దిగుబడి సరిగా రాదన్న ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతు కాడే లస్మన్న కుటుంబాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

రైతు కాడే లస్మన్న ఆత్మహత్య విషయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. స్పందించిన కేటీఆర్ రైతు కుటుంబాన్ని పరామర్శించి బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా నిలవాలని సూచించినట్లు పేర్కొన్నారు.

రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు రావడం బాధాకరమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేసినట్లు తెలిపారు.

ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాలతో రైతు మరణించిన సందర్భంలో కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా అందించడం ద్వారా రైతు కుటుంబాలకు అండగా నిలిచామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని కొనసాగించడంతో పాటు రైతులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు.

రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు సకాలంలో అందకపోవడం, యూరియా కొరత వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పంటల పెట్టుబడులు, అప్పులు, దిగుబడిపై అనిశ్చితి కారణంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.

రైతుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, రైతు కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు.

రెండేళ్లలో కేసీఆర్ సీఎం అవుతారు: అనిల్ జాదవ్

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మరో రెండేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, రైతుల సమస్యలను పరిష్కరించి వారికి పూర్తి అండగా నిలుస్తారని అన్నారు.

ప్రస్తుత పాలనను విమర్శిస్తూ ఇది ప్రజా పాలన కాదని, ప్రజల సమస్యలను పట్టించుకోని పాలనగా ఉందని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అభిరామ్ రెడ్డి, సర్పంచ్ ఎలుగు రాజన్న, శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE