e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

కలెక్టరేట్ ఎదుట నిరసన..

సీఈసీ రాజీనామా, ఓటర్ల హక్కుల పరిరక్షణకు ఇండియా కూటమి భారీ ధర్నా

కలెక్టరేట్ ఎదుట నిరసన.. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 6: ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సవరణలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, కొనసాగుతున్న SIR (Special Intensive Revision) ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జులు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్‌తో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు

నిరసన కార్యక్రమానికి ముందు కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ వద్ద మహాత్మా గాంధీ, డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఇండియా కూటమిలోని వివిధ పార్టీల నాయకులు, వందలాది మంది కార్యకర్తలు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో “సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి”, “ఓట్ చోర్ గద్దీ ఛోడ్”, “మోదీ డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

SIR ప్రక్రియలో పారదర్శకత ఉండాలి

ఈ సందర్భంగా ఇండియా కూటమి నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లోపిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటుందని అన్నారు. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా తన స్వతంత్రతను, విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

SIR ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఓటరుకు ఓటు హక్కు పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించే ముందు సంబంధిత ఓటర్లకు తగిన సమాచారం, నోటీసు అందించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు.

ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి, ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం

ధర్నా అనంతరం ఇండియా కూటమి నాయకులు ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ, SIR ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితా సవరణలో నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, బోథ్ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆదిలాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖిజర్ పాషా, ఎస్సీ విభాగం చైర్మన్ పరమేశ్వర్, ఎస్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సేద్మకి ఆనంద్ రావు, జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నపూర్ణ, మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షాహిద్, యూత్ కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు నాహిద్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ విభాగాల ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE