e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన నిఘా: ఎస్పీ

బేల పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ

అక్రమ రవాణా, గంజాయి, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన నిఘా: విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజల్లో నమ్మకం పెంచాలి

మన భారత్, బేల, అక్టోబర్ 6:

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ బేల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సిబ్బంది విధులు, పోలీస్ వాహనాలను పరిశీలించిన ఎస్పీ.. స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసులు, శాంతిభద్రతల పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు. పోలీసులపై ప్రజల్లో నమ్మకం, గౌరవం మరింత పెరిగేలా నీతి, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించే విధంగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని పేర్కొన్నారు.

మహారాష్ట్ర సరిహద్దుపై ప్రత్యేక నిఘా

బేల మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉండటంతో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, అనుమానం కలిగించే కార్యకలాపాలపై వెంటనే స్పందించాలని సూచించారు.

మండలంలో గంజాయి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, మట్కా, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రతి గ్రామంలో విలేజ్ పోలీసింగ్ పటిష్టం చేయాలి

ప్రతి గ్రామాన్ని పోలీసులు సందర్శిస్తూ విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్ (VPO) విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ సూచించారు. గ్రామాల్లో నేర పరిస్థితులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, నేరాలు జరిగే ముందు వాటిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.

గంజాయి రహిత ఆదిలాబాద్ లక్ష్యంగా పనిచేయాలి

గంజాయి సాగు, విక్రయం, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి

సీసీటీఎన్‌ఎస్‌లో కేసులకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

అలాగే పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించేలా, విధులకు ఆటంకం కలిగించేలా లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసులపై తిరగబడేలా వ్యవహరించే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి. శ్రావణ్, బేల ఎస్సై మధుకృష్ణ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE