e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

బ్యాక్ లాగ్ పోస్ట్ లు భర్తీ చేయాలి..

వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు గుర్తించి భర్తీ చేయాలి

2027 జనాభా లెక్కల్లో 21 రకాల వైకల్యాల వివరాలు నమోదు చేయాలి

మన భారత్, సెప్టెంబర్ 28, ఆదిలాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని, 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) ఆదిలాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మెస్రం నగేష్, ఎంపీ ఆర్‌డీ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికలాంగుల హక్కుల చట్టం అమలులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేసేందుకు 2026 ఆగస్టు 18న జీఓ నెం.19 విడుదల చేసిందని తెలిపారు. అయితే గత 14 సంవత్సరాలుగా జిల్లాల్లో వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ కాలేదని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో వికలాంగులకు కేటాయించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని తక్షణమే గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని కోరారు.

21 రకాల వైకల్యాల వివరాలు నమోదు చేయాలి

కేంద్ర ప్రభుత్వం 2027 జనాభా లెక్కల సేకరణకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో వికలాంగుల జనాభాను కచ్చితంగా నమోదు చేయడం అత్యంత అవసరమని ప్రతినిధులు తెలిపారు. వికలాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం 21 రకాల వైకల్యాలను గుర్తించినప్పటికీ, జనాభా లెక్కల్లో అన్ని రకాల వైకల్యాలకు సంబంధించిన వివరాలు సమగ్రంగా నమోదు కాకపోతే అనేక మంది వికలాంగులు గణాంకాల్లో కనిపించకుండా పోయే అవకాశం ఉందన్నారు.

ఆటిజం, నిర్దిష్ట అభ్యాసన వైకల్యాలు, మరుగుజ్జుతనం, కుష్ఠువ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తులు, చెవిటితనం, అంధత్వం, బహుళ వైకల్యాలు తదితర వర్గాలకు చెందిన వ్యక్తుల వివరాలను కూడా ప్రత్యేకంగా నమోదు చేయాలని కోరారు. రక్త సంబంధిత రుగ్మతలను ఒకే వర్గంగా కాకుండా అవసరమైన విధంగా స్పష్టమైన వివరాలతో నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

వికలాంగుల జనాభాకు సంబంధించిన సమగ్ర గణాంకాలు అందుబాటులో లేకపోతే విద్య, ఉపాధి, వైద్య సేవలు, పునరావాసం, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు తదితర అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అందువల్ల 2027 జనాభా లెక్కల్లో 21 రకాల వికలాంగుల వివరాలను సమగ్రంగా సేకరించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వికలాంగుల హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, ఉపాధి అవకాశాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ఖచ్చితమైన గణాంకాల సేకరణ అవసరమని ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప బెగం, జిల్లా కమిటీ సభ్యులు పోచ్చన్న, అనసూయ, ముత్యాల రాధ, గంగాధర్, బాబురావు, కే. అశన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. మంజుల, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు పిరాధ గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE