e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ప్రజల నుంచి అర్జీల స్వీకరణ..

సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్న అధికారులు

మన భారత్, సెప్టెంబర్ 28, తలమడుగు: మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తలమడుగు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అర్జీలు సమర్పించారు.

ప్రజలు విద్య, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, భూమి సంబంధిత అంశాలు, పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర సమస్యలను అధికారులకు వివరించారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ సంబంధిత శాఖల అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అధికారులు వాటిని పరిశీలించి, సంబంధిత శాఖలకు పంపించి నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీవో శంకర్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE