e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

వర్షాభావంతో ఎండుతున్న మక్క పంట

పెట్టుబడి పెట్టినా దిగుబడిపై రైతు ఆందోళన.. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి

మన భారత్, సెప్టెంబర్ 28, తలమడుగు: వర్షాభావ పరిస్థితులతో మక్క పంట ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు బొజ్జ పెద్ద గంగన్న ఆరు ఎకరాల్లో సాగు చేసిన మక్క పంటకు సరైన వర్షాలు లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.

మక్క పంట సాగు కోసం ఎకరాకు సుమారు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతు తెలిపారు. విత్తనాలు, దుక్కులు, ఎరువులు, పురుగుమందులు తదితర ఖర్చులు చేసినప్పటికీ పంటకు అవసరమైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో మొక్కలు ఎదుగుదల కోల్పోయి ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే పంటలో గణనీయమైన భాగం దెబ్బతిన్నదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే దిగుబడి వచ్చే అవకాశం కూడా లేకుండా పోతుందని రైతు పేర్కొన్నారు. మరోవైపు పొలంలో మిగిలిన పంటను పక్షులు సైతం నాశనం చేస్తున్నాయని తెలిపారు.

పంట సాగుపై పెట్టుబడి పెట్టిన మొత్తం తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావంతో నష్టపోయిన మక్క పంటను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం వివరాలను నమోదు చేయాలని కోరారు.

ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి అర్హులైన రైతులకు తగిన పరిహారం అందించాలని రైతు బొజ్జ పెద్ద గంగన్న విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ అధికారులు త్వరితగతిన పంటలను పరిశీలించి రైతులకు అవసరమైన సూచనలు, సహాయం అందించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE