e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

 గణపతి నిమజ్జనంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కాచ్కంటి, భరంపూర్‌లో డీజేలు, వాహనాలు సీజ్‌.. అనుమతి లేకుండా డీజేలు నిర్వహిస్తే కేసులు

30 పోలీస్‌ యాక్ట్‌, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి: డీఎస్పీ ఎల్‌. జీవన్‌రెడ్డి

మన భారత్, సెప్టెంబర్ 24, ఆదిలాబాద్: గణపతి నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిందని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్‌. జీవన్‌రెడ్డి తెలిపారు. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా అనుమతులు లేకుండా డీజేలు, సౌండ్‌ సిస్టమ్‌లు ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

కాచ్కంటిలో డీజేపై కేసు

సెప్టెంబర్‌ 23న కాచ్కంటి గ్రామంలో గణపతి నిమజ్జన బందోబస్తు సందర్భంగా వాహనంలో అనుమతి లేకుండా డీజే సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసి అధిక శబ్దంతో వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసు సిబ్బంది ఫిర్యాదు మేరకు డీజే యజమాని వావల్కర్‌ కళ్యాణ్‌, తండ్రి యాదవ్‌పై ఆదిలాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

భరంపూర్‌లో డీజేలు, వాహనం సీజ్‌

తలమడుగు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భరంపూర్‌ గ్రామంలో గణపతి నిమజ్జన ఉత్సవాల సందర్భంగా రెండు గణపతి మండపాల మధ్య డీజే సౌండ్‌ విషయంలో పోటీ ఏర్పడి, పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ఆదేశాలను పాటించకుండా డీజేలు నిర్వహించిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీంతో పాటు రెండు డీజే సౌండ్‌ సిస్టమ్‌లతో పాటు బొలెరో మ్యాక్స్‌ వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు.

అనుమతులు తప్పనిసరి

గణపతి నిమజ్జన కార్యక్రమాల్లో డీజేలు, సౌండ్‌ సిస్టమ్‌లు ఏర్పాటు చేయాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని డీఎస్పీ ఎల్‌. జీవన్‌రెడ్డి సూచించారు. 30 పోలీస్‌ యాక్ట్‌, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం, పోలీసుల సూచనలను ధిక్కరించడం, ఇతర గణపతి మండపాలతో పోటీకి దిగడం, గొడవలకు దారితీసేలా వ్యవహరించడం వంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం

గణపతి నిమజ్జన ఉత్సవాల్లో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని డీఎస్పీ కోరారు. భక్తి భావంతో, ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులు, నిర్వాహకులపై కేసులు నమోదు చేయడంతో పాటు చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE