ప్రతిపక్ష గొంతును అణచివేయడం సరికాదు: బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మొట్టే కుమార్
మన భారత్, సెప్టెంబర్ 12, తలమడుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడటం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టే కుమార్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మొట్టే కుమార్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం ప్రతిపక్ష ఎమ్మెల్యేల బాధ్యత అని అన్నారు. అలాంటి ప్రజాప్రతినిధులను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం, పోలీసుల ద్వారా నిర్బంధించడం, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రభుత్వం కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజా సమస్యలపై చర్చలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజల తరఫున ప్రశ్నించే హక్కును ఎవ్వరూ అడ్డుకోలేరని, ప్రతిపక్ష గొంతును అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని అన్నారు.
ప్రజా సమస్యలు, రైతులు, నిరుద్యోగులు, పేదలు, బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని మొట్టే కుమార్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తలమడుగు, తాంసి, భీంపూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు అభిరామ్ రెడ్డి సర్పంచులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
