ఇంటి తాళాలు పగులగొట్టి ఆభరణాల చోరీ..

Published on

-Advertisement-

గుడిహత్నూర్‌లో రూ.85,600 విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం.. 100 శాతం రికవరీ

క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ ఆధారాలతో కేసు ఛేదన.. దొంగ వస్తువులు కొనుగోలు చేసిన వ్యక్తిపైనా కేసు

మన భారత్, గుడిహత్నూర్, సెప్టెంబర్ 12: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని మహంకాళి గల్లీలో ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన సుమారు రూ.85,600 విలువైన బంగారు, వెండి ఆభరణాలను 100 శాతం రికవరీ చేసినట్లు గుడిహత్నూర్ ఎస్సై ఎల్. శ్రీకాంత్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 9న మహంకాళి గల్లీకి చెందిన దుర్వ రాధ తన భర్తతో కలిసి కూలి పనులకు వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళంతో పాటు లోపల ఉన్న స్టీల్ బాక్స్ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బాక్స్‌లో భద్రపరిచిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే గుడిహత్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పగిలిన రెండు తాళాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ బ్యూరో సహకారంతో స్టీల్ బాక్స్‌తో పాటు ఇతర వస్తువులపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. సాంకేతిక ఆధారాలతో పాటు క్షేత్రస్థాయిలో వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితుడి కదలికలను గుర్తించారు

దర్యాప్తులో చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో A1 పెండూర్ మధుకర్ (21), తండ్రి కిషన్, డ్రైవర్, గిర్జై గ్రామం, బజార్‌హత్నూర్ మండలం, ప్రస్తుతం గుడిహత్నూర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

అలాగే చోరీ చేసిన వస్తువులను కొనుగోలు చేసినట్లు గుర్తించిన A2 దహలే సంతోష్ (46), తండ్రి నారాయణ, గోల్డ్‌స్మిత్, లింగాపూర్ రోడ్, గుడిహత్నూర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో లభించిన ఆధారాలను పరిశీలించిన పోలీసులు చోరీకి గురైన మొత్తం బంగారు, వెండి ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసులో 100 శాతం రికవరీ సాధించినట్లు ఎస్సై ఎల్. శ్రీకాంత్ వెల్లడించారు. చోరీకి గురైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకుని బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

దొంగతనం చేసిన వస్తువులని తెలిసినప్పటికీ వాటిని కొనుగోలు చేయడం, విక్రయించేందుకు సహకరించడం చట్టరీత్యా నేరమని ఎస్సై హెచ్చరించారు. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ప్రజలు తమ ఇళ్లకు నాణ్యమైన తాళాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఎక్కువ సమయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముందుగా సమీప పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష మన భారత్, సెప్టెంబర్20,...

More like this

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...