ఉమ్రి గ్రామానికి చెందిన గర్భిణికి సురక్షితంగా ప్రసవం చేసిన 108 సిబ్బంది
తలమడుగు,మన భారత్ ఆగస్టు 7:
అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తతతో ఓ గర్భిణికి అంబులెన్సులోనే సురక్షితంగా ప్రసవం జరిగింది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన గర్భిణి రజిత శుక్రవారం 108 అంబులెన్సులోనే మగ శిశువుకు జన్మనిచ్చింది.
కుటుంబ సభ్యులు రజితను వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమెకు ఒక్కసారిగా తీవ్ర ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. పరిస్థితిని గమనించిన 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపట్టారు. అంబులెన్సులోనే సురక్షితంగా ప్రసవం చేయడంతో రజిత మగ శిశువుకు జన్మనిచ్చింది.
ప్రసవం అనంతరం తల్లి, శిశువు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన సిబ్బంది ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం తల్లీబిడ్డను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
సకాలంలో స్పందించి అత్యవసర పరిస్థితుల్లో ప్రసవాన్ని సురక్షితంగా నిర్వహించిన 108 అంబులెన్స్ సిబ్బంది పైలట్ పొచ్చన్న, ఈఎంటీ సాయికిరణ్ లను కుటుంబ సభ్యులు అభినందించారు. వారి అప్రమత్తత, సమయస్ఫూర్తి వల్ల తల్లీబిడ్డలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి.
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
