మానవీయత చాటుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Published on

-Advertisement-

బరంపూర్‌లో ముడుపు వెంకటమ్మ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన ఎమ్మెల్యే

ముడుపు వెంకటమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బరంపూర్‌లో పాడె మోసి కన్నీటి వీడ్కోలు పలికిన బోథ్ ఎమ్మెల్యే

తలమడుగు:మన భారత్ ,ఆగస్టు 7 బరంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముడుపు కేదారేశ్వర్ రెడ్డి మాతృమూర్తి ముడుపు వెంకటమ్మ మృతి చెందడంతో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వెంకటమ్మ మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బరంపూర్ గ్రామానికి చేరుకుని ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియల సందర్భంగా పాడె మోసి మృతురాలికి కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న ముడుపు కేదారేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోవడం ఎంతో బాధాకరమని, వెంకటమ్మ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి బాధను పంచుకున్నారు.

వెంకటమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, దుఃఖాన్ని అధిగమించే శక్తిని పొందాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోయడంతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ప్రజా జీవితంలో రాజకీయాలకు అతీతంగా మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ బాధిత కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తలమడుగు మండలంతో పాటు ఆయా మండలాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొని ముడుపు వెంకటమ్మకు నివాళులర్పించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం

తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా...

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్...

More like this