e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

పూజల పేరుతో భక్తులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

పూజల పేరుతో భక్తులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
నిందితుడి ఇంట్లో జింక చర్మం స్వాధీనం.. అటవీ జంతువుల చర్మాలను అక్రమంగా కలిగి ఉండటం నేరం: టూ టౌన్ ఎస్సై ప్రణయ్

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 24:

పూజల పేరుతో అమాయక భక్తులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీ జంతువుల చర్మాలను అనుమతి లేకుండా కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని టూ టౌన్ ఎస్సై ప్రణయ్ స్పష్టం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీ, సంజయ్ నగర్‌కు చెందిన జూకంటి గంగాధర్ (45) ఇంట్లో ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గోధుమ రంగులో ఉన్న జింక చర్మం లభించింది. దీంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో గంగాధర్ గత 20 సంవత్సరాలుగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అనుకుంట గ్రామంలో ఉన్న శివ మార్కండేయ మందిరంలో పూజారిగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. 2020లో కర్ణాటక అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి వద్ద జింక చర్మాన్ని కొనుగోలు చేసి తన ఇంటికి తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు.

జింక చర్మంపై కూర్చొని పూజలు నిర్వహిస్తే దుర్గామాత అనుగ్రహం కలుగుతుందని, భక్తుల వ్యక్తిగత సమస్యలను పరిష్కరిస్తానని నమ్మిస్తూ అమాయక ప్రజలను మోసగిస్తున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.

నిందితుడి వద్ద నుంచి జింక చర్మాన్ని స్వాధీనం చేసుకొని, అటవీ జంతువుల చర్మాన్ని అక్రమంగా కలిగి ఉన్న వ్యవహారంపై చట్టప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రణయ్ వెల్లడించారు. ఈ ఘటనపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

అటవీ వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వన్యప్రాణుల చర్మాలు, ఇతర అవయవాలను అక్రమంగా కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా నిల్వ ఉంచడం చట్టవిరుద్ధమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE