నెంబర్ లేని వాహనాలు సీజ్..

Published on

-Advertisement-

వాహనం సీజ్ చేసిన టూ టౌన్ పోలీసులు

ఆదిలాబాద్, మన భారత్ జూలై 25: వాహనాల నంబర్ ప్లేట్, ఇంజన్ నంబర్, ఛాసిస్ నంబర్‌లలో అక్రమంగా మార్పులు చేసి వినియోగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ కె. నాగరాజు హెచ్చరించారు. వాహనం గుర్తింపు వివరాలను మార్చి వినియోగిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అఖిల్ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనానికి అమర్చిన నంబర్ ప్లేట్ MH 29 B 3313 గా ఉండటంతో పోలీసులు సాంకేతికంగా వాహన వివరాలను పరిశీలించారు.

తనిఖీల్లో నంబర్ ప్లేట్‌పై ఉన్న వివరాలకు, వాహనం అసలు ఇంజన్, ఛాసిస్ నంబర్లకు పొంతన లేదని గుర్తించారు. సాంకేతిక పరిశీలనలో ఇంజన్ నంబర్ AP 01 H 5177, ఛాసిస్ నంబర్ AP 01 G 2465 కు సంబంధించినవిగా తేలింది. దీంతో వాహనానికి తప్పుడు నంబర్ ప్లేట్ అమర్చి అక్రమంగా వినియోగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ వ్యవహారంలో శాంతినగర్‌కు చెందిన గడసంవార్ అనూప్ (32) పై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ కె. నాగరాజు తెలిపారు. నిందితుడి నుంచి వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

వాహనం కొనుగోలు ముందు వివరాలు పరిశీలించాలి

వాహనాలను కొనుగోలు చేసే సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు ఇంజన్ నంబర్, ఛాసిస్ నంబర్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సీఐ కె. నాగరాజు సూచించారు. నంబర్ ప్లేట్ లేదా వాహనం గుర్తింపు వివరాల్లో మార్పులు చేసిన వాహనాలను కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.

ఎవరైనా వాహనాల నంబర్ ప్లేట్, ఇంజన్ నంబర్ లేదా ఛాసిస్ నంబర్‌లలో అక్రమ మార్పులు చేసినట్లు గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. వాహనాల గుర్తింపు వివరాలను మార్చి మోసపూరితంగా వినియోగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.

నిందితుడు: గడసంవార్ అనూప్ (32), తండ్రి: నారాయణ, వృత్తి: మెకానిక్, నివాసం: శాంతినగర్, ఆదిలాబాద్.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి..

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు.. ముగ్గురిపై కేసు నమోదు

వాట్సాప్ గ్రూప్‌లో వివాదాస్పద పోస్టులపై పోలీసుల చర్యలు.. గ్రూప్ అడ్మిన్‌పై కూడా కేసు ఆదిలాబాద్, జూలై 25: సోషల్ మీడియాలో...

బీట్ వ్యవస్థను అమలు చేయాలి: ఎస్పీ

ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ నేరాల నియంత్రణకు పటిష్టమైన గస్తీ, బీట్ వ్యవస్థను అమలు చేయాలి:...

బ్యాంకు నుంచి బయటికొచ్చారా.. ఇక దొంగల కన్ను మీ పైనే

బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారే టార్గెట్‌.. అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్ ఆదిలాబాద్‌లో స్కూటీ...

సంతకాల సేకరణ షురూ..!

సీఐటీయూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభం.. స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన: సీఐటీయూ మల్కాజ్‌గిరి మన భారత్, జూలై 25:...

More like this

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు.. ముగ్గురిపై కేసు నమోదు

వాట్సాప్ గ్రూప్‌లో వివాదాస్పద పోస్టులపై పోలీసుల చర్యలు.. గ్రూప్ అడ్మిన్‌పై కూడా కేసు ఆదిలాబాద్, జూలై 25: సోషల్ మీడియాలో...

బీట్ వ్యవస్థను అమలు చేయాలి: ఎస్పీ

ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ నేరాల నియంత్రణకు పటిష్టమైన గస్తీ, బీట్ వ్యవస్థను అమలు చేయాలి:...

బ్యాంకు నుంచి బయటికొచ్చారా.. ఇక దొంగల కన్ను మీ పైనే

బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారే టార్గెట్‌.. అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్ ఆదిలాబాద్‌లో స్కూటీ...