జిల్లాకు వర్ష హెచ్చరిక..

Published on

-Advertisement-

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం (20-07-2026) మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావరణ సమాచారం సూచిస్తోంది. మధ్యాహ్నం 12:00 గంటల నుంచి సాయంత్రం 4:20 గంటల వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అదేవిధంగా సాయంత్రం 4:00 గంటల నుంచి 4:20 గంటల వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు, ప్రయాణికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా బహిరంగ మైదానాల్లో నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేకపోతే వర్షం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని తెలిపారు.

ప్రజలు వాతావరణ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం విడుదల చేసే అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ ఆర్సీ ఇన్చార్జి.

ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం

తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా...

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్...

More like this